IND vs ENG : టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ కు దిగిన ఇండియా

నవతెలంగాణ-హైదరాబాద్ : టీ-20 వరల్డ్ కప్‌లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. సెమీస్-2లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. వెస్టిండీస్‌లోని గయానా స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తాడో పేడో తేల్చేకునేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. సూపర్-8లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమ్‌తోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. సెమీస్‌లో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా అదే టీమ్‌తో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు రంగంలోకి దిగింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఇరుజట్లు సమ ఉజ్జీవులుగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఫైనల్‌లో సౌతాఫ్రికాతో టైటిల్ కోసం తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ 8 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం పడటంతో ఆలస్యమైంది.

Spread the love