IND vs ENG | భార‌త్, ఇంగ్లండ్ మ్యాచ్ టాస్ ఆల‌స్యం..

నవతెలంగాణ-హైదరాబాద్ : పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ భార‌త్ ఇంగ్లండ్  మ్యాచ్ ఆల‌స్యం కానుంది. వ‌ర్షం కార‌ణంగా ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ త‌డిగా మారింది. దాంతో, అంపైర్లు షెడ్యూల్ ప్ర‌కారం రాత్రి 8 గంట‌ల‌కు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. మైదానంలో ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. దాంతో, సిబ్బంది పిచ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. గురువారం ఉదయం నుంచే గ‌యానాలో వాన దంచ‌డం మొద‌లెట్టింది. దాంతో, అక్క‌డి ప్రొవిడెన్స్ స్టేడియంలోని పిచ్‌ను పూర్తిగా క‌ప్పేశారు. వాన త‌గ్గాక ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ప్రాక్టీస్ కోసం మైదానంలోకి వ‌చ్చారు. అయితే.. అంత‌లోనే మ‌ళ్లీ చినుకులు మొద‌ల‌య్యాయి. దాంతో, అంద‌రూ డ్రెస్సింగ్ రూమ్‌కు ప‌రుగెత్తారు.

Spread the love