నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో 78వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా భారతదేశ స్వతంత్రం సాధించిందని దేశంలో అనేక సవరణలు ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా సాగుతుందని అమరవీరుల తగల స్ఫూర్తిగా దేశభక్తితో ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా కృషి చేయాలని కోరారు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై ముస్లిం తీవ్రవాద సంస్థలు హత్య దాడులు చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని అక్కడ హిందువులకు కేంద్ర ప్రభుత్వం మరియు ఐక్యరాజ్యసమితి తగు చర్యలు తీసుకొని ప్రజల అక్కడి ప్రజల రక్షించాలని కోరుతున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, అదనపు జిల్లా న్యాయమూర్తులు సీనియర్ సివిల్ చర్చ్ సీనియర్ జూనియర్స్ సివిల్ జడ్జిలు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు ఉపాధ్యక్షులు రాజు బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్రెడ్డి న్యాయవాదులు ఈగ గంగారెడ్డి, విగ్నేష్, అందిన దీపక్, సురేష్, పడిగల వెంకటేశ్వర, అశోక్, వినయ్, రవి, మాణిక్ రాజ్, నారాయణ, విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు.