కాంగ్రెస్ లో చేరిన మహారాష్ట్ర సంగ్లీ లోక్‌సభ స్వతంత్ర ఎంపీ

నవతెలంగాణ – హైదరాబాద్: రోజులు గడుస్తున్నా కొద్ది దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు రసవతారంగా మారుతున్నాయి.కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కొద్ది మంది సభ్యులు మాత్రమే తక్కువగా ఉండటంతో..ఆ సభ్యులను భర్తీ చేసేందుకు చేరికలను ప్రోత్సహిస్తోంది. తాజాగా మహారాష్ట్ర సంగ్లీ లోక్‌సభ స్వతంత్ర ఎంపీ విశాల్ ప్రకాష్ బాబు పాటిల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఎంపీ విశాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.విశాల్ చేరికతో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 100కు చేరింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. ఇండియా కూటమి మొత్తం కలిపి 232 లోక్ సభ స్థానాల్లో గెలిచింది. అధికారం చేపట్టాలంటే 272 సీట్లు అవసరం. అయితే, ఆ మేజిక్ ఫిగర్‌కు ఇంకా 40 సీట్లు అవసరం. ఇప్పుడు ఒక ఎంపీ చేరడంతో క్రమంగా కాంగ్రెస్ బలం పెరుగుతోంది. మరికొంత మంది ఎంపీలు కూడా చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Spread the love