– బజరంగ్ దళ్ బెదిరింపులపై గాయకుడు దిల్జిత్ దోసంజ్
న్యూఢిల్లీ : ఇండియా ఎవ్వడి సొత్తూ కాదని ప్రముఖ గాయకులు, నటులు దిల్జిత్ దోసంజ్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన కచేరిని ఉర్దూ కవి రహత్ ఇండోరికి ఆయన అంకితం ఇచ్చారు. ‘దిల్ లుమినాటి ఇండియా టూర్ 2024’లో భాగంగా ఆదివారం ఇండోర్‌లో దోసంజ్ సంగీత కచేరి జరిగింది. అయితే ఈ కచేరికి వ్యతిరేకంగా బజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) బెదిరింపులకు పాల్పడ్డాయి. ఆందోళనలు కూడా నిర్వహించాయి. పలువురు బిజెపి నేతలు కూడా వీటికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆదివారం తన ప్రదర్శనలో దోసంజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 26న ఢిల్లీలో ప్రారంభమైన ఈ టూర్ ఈ నెల 29న గౌహతిలో ముగియనుంది.