- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారంకాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి తొలి అడుగు పడనుందన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) ప్రధాన కార్యాలయం ప్రారంభంకానున్నట్లు తెలిపారు. కేవలం 6 నెలల్లోనే రికార్డు సమయంలో FCDA భవనం పూర్తైందన్నారు.ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రూ.20 కోట్లతో 15 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో FCDA భవన నిర్మాణం జరిగింది.
- Advertisement -



