భారత జీడీపీ 8.2% నమోదు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. 2023- 24 మార్చితో ముగిసిన మూడో త్రైమాసికంలో అంచనాలు మించి 7.8 శాతంగా జీడీపీ వృద్ధి నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 8.2 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం 8.6 శాతంతో పోలిస్తే కాస్త తక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి- మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.2 శాతంగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7 శాతం వృద్ధి చెందింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండోసారి ఎన్‌ఎస్‌ఓ వెలువరించిన అంచనాల్లో 7.7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. అంతకుమించి జీడీపీ వృద్ధి నమోదుకావడం గమనార్హం. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో పొరుగుదేశమైన చైనా 5.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.

Spread the love