నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
నూతన అవిష్కరణలకు సూర్యాపేట జిల్లా వేదిక కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటా ఇన్నోవేషన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ , జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు , కాలేజి యువకులు,ఆవిష్కరణ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు వారి యొక్క ఆవిష్కరణ లు మూడు నిమిషాలు వ్యవధిలో వాళ్ళ వీడియో తీసి దిగువ తెలిపిన సెల్ నెంబర్కు 9100678543 వాట్సాప్ చేయాలని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో పాటు పలు శాఖల అధికారులు, పాఠశాలలతో పాటు గ్రామాల్లో ఈ కార్యక్రమం పై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఆ యొక్క ఇన్నోవేషన్స్ను తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వారు సెలెక్ట్ చేసి స్వాతంత్ర దినోత్సవం నాడు పెరేడ్ గ్రౌండ్లో వారి ఇన్నోవేషన్ ప్రదర్శనకు అవకాశం ఇస్తారు ఈ యొక్క అవకాశము గ్రామ, పట్టణ, మండల , జిల్లా పాఠశాల విద్యార్థులు, గైడ్ టీచర్ సహకారంతో మంచి ఇన్నోవేషన్స్ జిల్లా నుంచి రాష్ట్రానికి పంపి మన జిల్లాకు మంచి పేరు తీసుకు రాగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్ పి సీఈవో వివి అప్పారావు,డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డీఎంహెచ్ఓ కోటాచలం, డిపిఓ సురేష్ కుమార్,డిటిడిఓ శంకర్, బి డబ్ల్యు ఓ వెంకటరమణ,జిల్లా విద్యాశాఖ అధికారి కే అశోక్, జిల్లా సైన్స్ అధికారి శ్రీ ఎల్ దేవరాజు,జిల్లా కోఆర్డినేటర్ రాజు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.