
నవతెలంగాణ – కంఠేశ్వర్
సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునే కలిసికట్టు తనం మని నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు ప్రజల సొంతమని, రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు మీ పోలీసులకు సహాకరించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్ అన్నారు. ఈ నెల 7న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అన్ని గణేష్ మండపములకు సెక్యూరిటి ఇవ్వడానికి మరియు పాయింట్ బుక్ ఏర్ాటుకోసం సమాచారం ఇవ్వగలరు. కావున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని అన్ని గ్రామాలలోని ఆయా వీధులలో గణపతిని ప్రతిష్టించుకునే సంఘాల వారు / కాలనీల వారు http://policeportal.tspolice. gov.in
తెలియజేసిన లింక్ ద్వారా సమాచారం అందించాలి అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు.