సువిక్షిత్, గీతికా రతన్ కొమ్మి జంటగా రూపొందిన ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శకుడు కార్తికేయ కొమ్మి మీడియాతో పలు చిత్ర విశేషాలను పంచుకున్నారు. నేను సాధ్యం, వసూల్ రాజా, లక్ష్మీబాంబ్ సినిమాలకు దర్శకత్వం చేశాను. కొత్తవాళ్లతో నేను చేసిన తొలి ప్రాజెక్ట్ ఇది. యదార్థ సంఘటనతో చాలా రియలిస్టిక్‌గా ఈ సినిమాను రూపొందించాను. పేరెంట్స్ ఛాయిస్, సొసైటీ ఛాయిస్, పిల్లల ఛాయిస్.. వీటి మధ్య ఉండే క్లాష్.. ఇదే ఈ చిత్ర కథాంశం. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. చిత్రలహరి టైమ్ పీరియడ్ మిస్ అయిన వారికి, ఆ టైమ్‌లో చిత్రలహరి అనుభూతిని పొందిన వారికి ఈ సినిమా పూర్తి సంతృప్తినిస్తుంది. చిత్రలహరి గురించి అందరూ ఎలా వెయిట్ చేసే వారు?, అక్కడ జరిగే ప్రేమకథ.. ఇలా అందరికి 90వ దశకం రోజులను గుర్తుకు తెస్తుంది. ఈ సినిమాలో మంచి ఎమోషన్ అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఇదొక బిచ్చగాడి జీవితం నుంచి స్ఫూర్తిగా పొంది రాసుకున్న కథ. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ.



