తుంగతుర్తిలో 16 సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు.. 

నవతెలంగాణ – ధర్మారం 
మండలంలో ని తుంగతుర్తి గ్రామంలో గ్రామస్థుల సహకారంతో గ్రామం మొత్తం కనపడే విధంగా గ్రామంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు స్థానిక ఎస్సై టి సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో ఎలాంటి నేరాలు జరిగిన అప్రమంతంగా ఉండడానికి  దొంగతనాలు, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు లాంటివి జరుగకుండా ముందు జాగ్రత్తగా ఇలా గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసినట్టు ఎస్సై టి.సత్యనారాయణ వివరించారు. సీసీటీవీలో ఏర్పాటు వలన ఏ నేరాలు జరిగిన నివారించడానికి సహాయకారిగా పనిచేస్తాయని, నేర నివారణకు సహకరిస్తాయని గ్రామంలో నేరాలు జరగకుండా రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని వివరించారు.
Spread the love