మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ముమ్మరంగా వాహన తనిఖీలు 

Intensive vehicle checks during Maoist Week celebrations– తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి 
నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మావోయిస్టుల బందు నేపథ్యంలో పస్రా సీఐ గద్ద రవీందర్ ఆధ్వర్యంలో తాడ్వాయి స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన పోలీస్ బలగాలతో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం- ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాలలోని గుండాల మండలం దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ సభ్యుడు మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం దామరతోగు ఎన్కౌంటర్ ను ఖండిస్తూ ములుగు. భూపాలపల్లి జిల్లాల బందుకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు  పోలీస్ బలగాలు మోహరించి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.  దామరతోగు ఎన్కౌంటర్ ఖండిస్తూ ములుగు. భూపాలపల్లి జిల్లాల బందుకు పిలుపునివ్వడంతొ మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో  పోలీసు బలగాలు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా గుత్తి కోయ గూడాలలో కార్డెన్ సర్చ్ నిర్వహించి అపరిచితులకు ఆశ్రమం కల్పించవద్దని అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పోలీసులు ఆర్మీ రమేష్, జాజ సాంబయ్య, పూజారి రమేష్, సివిల్, సిఆర్పిఏఫ్ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love