నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ఇంటర్ తుది ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మే 13 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేపటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. మొబైల్ నుండే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు వెల్లడించారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (థియరీ) 13-05-2026 నుండి రెండు సెషన్లలో, ప్రాక్టికల్ పరీక్షలు కూడా 22-05-2026 నుండి రెండు సెషన్లలో జరుగుతాయి. విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును 13-04-2026 నుండి 20-04-2026 వరకు వారి సంబంధిత జూనియర్ కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు.



