పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు..

Polavaram-Projectనవతెలంగాణ-హైదరాబాద్ : వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై చంద్రబాబు సర్కారు అంతర్జాతీయ నిపుణులతో విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికా, కెనడాల నుంచి వచ్చిన జలవనరుల నిపుణులు నలుగురు ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని, పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో అమెరికాకు చెందిన డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్‌ ఉన్నారు. జులై 3 వరకు జరగనున్న ఈ టూర్ లో భాగంగా డయాఫ్రం వాల్, రెండు కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్‌లను పరిశీలించి, ప్రాజెక్టు డిజైన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష జరుపుతారు.

Spread the love