ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలి: శంకర్ 

నవతెలంగాణ – మిరుదొడ్డి 

ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చేయాలని డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు పేదలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం బాగుంది కానీ దానికి పకడ్బంద్ గా ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి కాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ మనువాద శక్తులు ఎజెండాను ఓడించి భారత రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ఐక్య కార్యచరణ చట్టాన్ని ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు కేటాయించి తెలంగాణ సమాజాన్ని విద్య వైజ్ఞాన రంగాల్లో అగ్రస్థానంలో నిలుపాలని డిమాండ్ చేశారు. గురుకుల సంక్షేమ హాస్టల్లో కనీస వస్తువులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చార్జర్ ను పెంచాలి అని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రణాళికతో కూడిన విద్య విద్యాలను ప్రవేశపెట్టి అంబేద్కర్ విద్యానిధి బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. పౌరులందరికీ నాణ్యమైన విద్య వైద్యం అందించాలని అన్నారు. భూ సంస్కరణ అమలు చేసి దళిత బహుజనలకు భూమి పంపిణీ చేసి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ , పట్టణ లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం సమగ్ర అమలుచేసి నిధులు కేటాయించాలని అన్నారు. గృహ నిర్మాణ కార్మికులు సంక్షేమ సమగ్ర చట్టం అమలు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ , చంద్రం, శీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love