క్రిష్ణవేణిలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత  పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగ దినోత్స కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల చేత యోగ, ఆసనాలు చేయించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ యోగ మానవునికి ఎంతో అవసరమని, ప్రపంచ దేశాలు కూడా యోగ వైపు చూస్తున్నాయని విద్యార్థులకు తెలిపారు. యోగా అనేది 5వేల సంవత్సరాల నుండి భారతదేశంలోఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగము అని అన్నారు. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలం కొన్నిశారీరిక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు, కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తిల కలయిక అని అన్నారు. విజ్ఞానశాస్త్ర ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవనసారవిధానమనని విద్యార్థులకు బోధించారు.దీనిలోజ్ఞాన యోగము (తత్వశాస్త్రము ), భక్తి యోగము, రాజ యోగము, కర్మ యోగములు ఉన్నాయన్నారు. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైనచెప్పిన యోగాలన్నిటిలో సమతౌల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకువస్తాయని తెలిపారు. ప్రతిరోజు విద్యార్థులు యోగ కొరకు సమయం కేటాయించాలని, యోగ ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కుందారం శ్రావణ్, పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ చిలుక గంగా ప్రసాద్, పాఠశాల డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ కుందారం సచిన్, ఉపాధ్యాయులు మనోజ్ఞ,  రమ్య, రూప శ్రీ, షాహిన్, నికిత, ఉమతరుణం,  వసంతా, ప్రవళిక, శైలజ, నుస్రత్ బేగం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love