కనిపించని కనికట్టు

ఓటు వేసే నీకే తెలియాలి
ఓటు విలువ
అది పిచ్చోని చేతిలో
రాయి కాకూడదు
నీ బతుకును ఆహుతి
చేయటానికి మాయాజాలపు బాసలు చేసే
మాయల పకీర్లు వీధి వీధిలో
గల్లీ గల్లీలో తారాసపడతారు
పథకాల క్రీనీడలో
మద్యం మహమ్మారిని వదిలెళ్ళిపోతారు
పచ్చనోట్ల పడగనిడలో
స్వార్ధమైన భరోసాలు ఇస్తారు
మందు విందు తాయిలాలిచ్చి మనసు మార్చుతారు
కాసింత కనిపెట్టుకొ
మంచినేతను మన్నికగా
ఎన్నుకునే
సమయం ఆసన్నమైంది
మర్మమెరిగి మసులుకుంటేనే జరంత భద్రం
ఆ బూటకపు మాటల బుజ్జగింపులకు తలొగ్గి
బతుకును బానిసను
చేయకుజి
వేటి కోసమే అర్రులు
చాచితే పంజరం చెరలో
ఐదేండ్లు
బందీగానే ఉండిపోతావ్‌
ఓటరన్న
ఒక్కసారి ఆలోచించు
నిజం బోధపడుతుంది
ఇది కనిపించని కనికట్టు
కాస్త కనిపెట్టుకొని
ఓటు అస్త్రాన్ని గురి చూసి సంధించు
నీ స్థితి మారుతుంది
దేశగతి మారుతుంది
– నెల్లుట్ల సునీత, 7989460657

Spread the love