
మండలంలోని మద్దికుంట ల వెలిసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే జాతరకు ఆహ్వాన పత్రికను సిఐ రామనకు, ఎస్సై నరేష్ లకు ఆలయ కమిటీ గురువారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వడ్ల లింగమాచారి, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు బండి ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు దుంపల బాలరాజు, సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.