నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండలం పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(సిరిసిల్ల)లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.జయ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గిరిజన,గిరిజనేతర విద్యార్థినిలు కళాశాలలో అందుబాటులో ఉన్న బిఎ( హెచ్ ఈ పి),బి జెడ్ సి , ఎం బి జెడ్ సి,బీకాం (జనరల్ ),బీకాం (సి ఏ ), ఎంపీసీ,ఎంపీసీ ఎస్, గ్రూపులలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ సాగుతోందని, అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు. కళాశాలలో విద్యార్థులకు ఎన్ సి సి,స్పోర్ట్స్ , ఎన్ఎస్ఎస్ అవకాశాలతో పాటు వృత్తి విద్యా కోర్సులు, ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రవేశాల కోసం సెల్ నంబర్లు 9110585202, 99 85 60 7074,9550267058 సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.