ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వివిధ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానం..

– తమ కళాశాల లో 61% రిజల్ట్..

– కళాశాల ప్రిన్సిపల్ సుహాసిని..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
గన్ ఫౌండ్రి లోని మహబూబియా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ సువాసిని తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గత ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థినిలు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో మంచి ఫలితాలతోరాణించారని తెలిపారు. 61 శాతం రిజల్ట్ సాధించామన్నారు. తమ కళాశాల  హెచ్ ఈ సీ విద్యార్థిని కేజీయ స్టేట్  ర్యాంకర్ గా రాణించాలన్నారు. బైపీసీలో వర్షిని, ఎంపీసీలో గీత లు కళాశాల టాపర్ నిలిచారని తెలిపారు. తమ కళాశాలలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి హెచ్ఈసి కోర్సులు ఉన్నాయన్నారు. కళాశాల విద్యార్థినిలకు ఉచితంగా టెస్ట్ పుస్తకాలను అందిస్తామన్నారు. స్కాలర్షిప్, బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. తమ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని, తమ లెక్చరర్లు నాణ్యమైన విద్య బోధన అందిస్తారని చెప్పారు. ప్రైవేటు దీటుగా ప్రభుత్వ విద్యను అందిస్తున్నామని తెలిపారు.
Spread the love