Monday, June 1, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట

ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. అయితే, టైటిల్ గెలిచింది ఆర్సీబీనే అయినా, పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌లో అసలు సిసలు హీరోగా నిలిచింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు తన అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ 2026 సీజన్‌లోని ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ కొల్లగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అతని భయంలేని, నిలకడైన స్ట్రోక్‌ప్లేతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ అసాధారణ బ్యాటింగ్‌కు గుర్తింపుగా ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’, ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డులు కూడా వైభవ్‌నే వరించాయి. ఇంతటితో ఆగకుండా, 237.31 స్ట్రైక్ రేట్‌తో ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ అవార్డును, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది ‘సూపర్ సిక్సెస్’ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ యువ కెరటం తన ప్రదర్శనతో ఎన్నో బ్యాటింగ్ రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త సూపర్ స్టార్‌గా అవతరించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -