సంతాప సభలో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజహరుద్దీన్,
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఎంపీ రఘురాం రెడ్డి
నవతెలంగాణ -ఖమ్మం
కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ జావీద్ అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఖమ్మం నగర కమిటీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ సంతాప సభను ఖమ్మం వైఎస్సార్ నగర్ సమీపంలోని రెడ్ హిల్స్ లోని జావీద్ స్వగృహంలో నిర్వహించారు. ఈ సభకు వారంతా హాజరై నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించిన వ్యక్తి జావీద్ అని అన్నారు. జావీద్ ను ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఇబ్బంది పెట్టిందని తెలిపారు. జావీద్ వ్యాపారాల్లో నష్టం వచ్చేలా చేసిందని, అయినా వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. జూన్ లో జావీద్ కు పదవి రావాల్సి ఉందని, సన్మాన సభ జరగాల్సిన స్థలంలో సంతాప సభ నిర్వహించాల్సి వస్తోందని అనుకోలేదన్నారు. రాజకీయ హామీగా కాకుండా భవిష్యత్ లో జావీద్ కుటుంబానికి, ఆయన అనుచరులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర విత్తన గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్ బాబు, కొండబాల కోటేశ్వరరావు, బాలసాని లక్ష్మీ నారాయణ, సుడా చైర్మెన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, సంబాని చంద్రశేఖర్, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, మానుకొండ రాధా కిషోర్, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
జావీద్ కుటుంబానికి అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


