నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ వేదిక మారింది. బెంగుళూరు నుంచి అహ్మదాబాద్ మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో అహ్మదాబాద్ వరుసగా రెండో సంవత్సరమూ ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. అదే విధంగా క్వాలిఫయర్-1 ధర్మశాలలో జరుగుతుంది. రెండు ఫ్లేఆఫ్స్ మ్యాచ్‌లను న్యూచండీగఢ్‌లో నిర్వహించనున్నారు.
వాస్తవంగా..ఈనెల 31న జరిగే టైటిల్ ఫైట్‌ను బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ తొలుత నిర్ణయించింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు అయినందున సంప్రదాయం ప్రకారం ఈసారి ఐపీఎల్ ఫైనల్ బెంగళూరులో జరగాలి. ‘నిజానికి ఫైనల్‌ను బెంగళూరులో నిర్వహించాలని తొలుత నిర్ణయించాం. అయితే బీసీసీఐ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనల పరిధికి మించిన డిమాండ్లను స్థానిక క్రికెట్ సంఘం, అధికారుల నుంచి రావడంతో ఆ నగరం నుంచి వేదికను తరలించాం’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్లేఆఫ్స్ షెడ్యూల్
మే 26 : క్వాలిఫయర్-1, ధర్మశాల
మే 27 : ఎలిమినేటర్, న్యూ చండీగఢ్
మే 29 : క్వాలిఫయర్-2, న్యూ చండీగఢ్
మే 31 : ఫైనల్, అహ్మదాబాద్



