Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ నాగరాజు ఉన్నట్టా.? బదిలీ అయినట్టా.?

సీసీ నాగరాజు ఉన్నట్టా.? బదిలీ అయినట్టా.?

- Advertisement -

జూన్ 29న బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా డిఆర్డీఏ
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని కొయ్యుర్, ఎడ్లపల్లి, వల్లెంకుంట, ఇప్పలపల్లి, ఆన్సాన్ పల్లి గ్రామాల సిసి వివోఏలకు (సెర్ప్ కమ్యూనిటీ కోఆర్డినేటర్)గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు సెర్ప్ కార్యకలాపాల పొగ్రెస్ వెనుకబడిన నేపథ్యంలో చిట్యాల మండలానికి డిప్యుటేషన్ పై బదిలీ చేస్తూ జూన్ 29న భూపాలపల్లి జిల్లా డిఆర్డీఏ బాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలిసింది. అయితే సిసి చిట్యాల మండలానికి వెళ్లి బాధ్యతలు చేపట్టకపోగా తన పలుకుబడి ఉపయోగించి, లేదా ఉన్నతాధికారులకు అమ్యామ్యాల ఆశ చూపి మల్హర్ మండలంలోనే తిష్ట వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మండల ఐకెపి ఎంపీఎం హనుమంతరావును వివరణ కోరగా బదిలైన మాట వాస్తవమే కానీ పొగ్రెస్ పెంచేందుకు కృషి చేస్తానని పిడికి విన్నవించినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -