Thursday, May 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహిజ్బుల్లా కమాండర్‌‌ని హతమార్చిన ఇజ్రాయిల్‌

హిజ్బుల్లా కమాండర్‌‌ని హతమార్చిన ఇజ్రాయిల్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలపై బుధవారం బాంబు దాడులు చేసి హిజ్బుల్లా రాద్వాన్ ఫోర్స్ కమాండర్ మాలెక్ బలూను హతమార్చినట్లు ఇజ్రాయిల్‌‌ దళాలు గురువారం ప్రకటించాయి. అయితే దీనిపై హిజ్బుల్లా ఇంతవరకు స్పందించలేదు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇజ్రాయిల్‌ ‌సైన్యం దాడి గురించి బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో ప్రకటించారు. బుధవారం లెబనాన్‌ ‌రాజధాని బీరూట్‌ దక్షిణ శివారు ప్రాంతాల్లోని ఘోబేరిని (పురపాలక సంఘ కార్యాలయాన్ని) లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి అని లెబనాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. దాడులు చేసినప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని..ఈ దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లిందని న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ స్థావరాలపై కాల్పులు జరపడం, ఇజ్రాయెల్ సైనికులను గాయపరచడం వంటి వాటికి రద్వాన్ ఉగ్రవాదులే బాధ్యులు. ఏ ఉగ్రవాదికీ మినహాయింపు లేదు. ఇజ్రాయెల్ తన సుదీర్ఘ హస్తంతో ప్రతి శత్రువును, హంతకుడిని పట్టుకుంటుంది అని నెతన్యాహు టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -