ముమ్మరంగా గృహజ్యోతి జీరో బిల్లుల జారీ

–  నిమగ్నమైన విద్యుత్ అధికారులు, సిబ్బంది
–  హర్షం వ్యక్తం చేస్తున్న  వినియోగదారులు
–  జీరో బిల్లు రాని వారు మరల దరఖాస్తు చేసుకోవాలి
–  అర్హత కలిగిన ప్రతియొక్క వినియోగదారునికి జీరో బిల్లులు
నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం లో విద్యుత్త వినియోగదారులు అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం (వాడకం) వినియోగించుకున్న వినియోగదారులకు శుక్రవారం నాడు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న జీరో బిల్లులు ఇస్తున్నారు.మండలం లోని పెద్దవూర, చలకుర్తి, పర్వేదుల, నాయిన వానికుంట గ్రామం లో విద్యుత్ అధికారులు విధ్యుత్ జీరో బిల్లులను సంబందించిన రిసిప్ట్ లు ఇస్తున్నారు. ఈసందర్బంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ.. అన్ని అర్హతలు ఉండి గృహజ్యోతి జీరో బిల్లు రానివారు ఎలాంటి ఇబ్బందుల గురికాకుండా పెద్దవూర ఎంపీడిఓ కార్యాలయంలో పోర్టల్ రెండు, మూడు రోజుల్లో అందుబాటులో రానున్నదని, అధైర్య పడకుండా మీ యొక్క ఇంటి సర్వీస్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు మరొక సారి నమోదు చేయించుకోవాలని తెలిపారు.స్లిప్ తీసుకుని విద్యుత్ కార్యాలయానికి వస్తే అప్లోడ్ చేస్తామని అన్నారు. ప్రతి వినియోగదారుడు కి జీరో బిల్ వస్తున్నదని, అర్హులైన వినియోగదారులు అందరూ విద్యుత్ సంస్థకు సహకరించగలరని కోరారు.
Spread the love