వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డిని బొంద పెట్టడం ఖాయం 

– రతిరం తండా ఎంపీటీసీ మదన్ లాల్ 

నవతెలంగాణ – నెల్లికుదురు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బొంద పెట్టడం ఖాయమని రతిరం తండా ఎంపీటీసీ గుగులోతు మదన్ లాల్ ఆ పార్టీ జిల్లా మండల నాయకులు నల్లనీ పాపారావు వద్ది భవాని ప్రసాద్ చందు రాజ్ కుమార్ యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం మోదీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్న సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ బొంద పెటడం ఖాయమని అన్నారు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెరుమాండ్ల శివ సాయి దుస్సా యాకయ్య కుక్కల ఐలయ్య ఒంగాల రామచంద్రు యాకిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కస్తూరి శంకర్ తోపాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
Spread the love