
పనికట్టుకొని కొందరు తమ హాస్పిటల్ పై దుష్ప్రచారం చేయడం తగదని, నిజా నిజాలు తెలుసుకోవాలని పట్టణంలోని పెర్కిట్ ఆశ హాస్పిటల్ వైద్యులు శేఖర్ రెడ్డి ఆదివారం తెలిపారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బాల్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని మంతిని గ్రామానికి చెందిన బద్దం చిన్నారెడ్డి 45 సంవత్సరాలు గత నెల 8వ తేదీ కడుపునొప్పి రావడంతో ఇతర హాస్పిటల్లో చూయించుకొని ,ఆ తర్వాత మా హాస్పిటల్ కు వచ్చినాడని, కిడ్నీ స్టోన్స్ తో 9వ తేదీన మిషన్ ద్వారా సర్జరీ చేసినట్టు, 13వ తేదీ డిశ్చార్జి అయినట్టు తెలిపారు. ఇన్ఫెక్షన్ అనేది శరీర తత్వమును బట్టి వస్తుందని, ఇందుకు మేమే బాధ్యులమని దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. హాస్పిటల్ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో కేసులు సక్సెస్ చేసినట్టు ,పేద ప్రజలకు సైతం అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ, మానవత దృక్పథంతో సైతం హాస్పిటల్ వైద్యులందరూ వచ్చేవారికి సేవలు అందిస్తున్నామని తెలిపారు.