
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో డిసిసిబి మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ నేత సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహాత్మ జ్యోతిరావు బాబు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమనడం హస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఇటీవలే అసెంబ్లీ స్పీకర్ ను కలిసి కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు బాపు పూలే విగ్రహం పెట్టమని స్పీకర్ ను కలిసి కోరారు. పిల్లల మరి శ్రీనివాస్ నేత మాట్లాడుతూ 9 సంవత్సర కాలంలో మహాత్మ జ్యోతిరావు బాపు పూలే విగ్రహం అప్పుడు కేసీఆర్ కు గుర్తు రాలేదా అని నిలదీశారు.గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మహాత్మ జ్యోతిరావు బాపు పూలే విగ్రహం పెట్టమని ఎందుకు కోరలేదని నిలదీశారు.కెసిఆర్ 9 సంవత్సరాల కాలంలో బీసీలను అణగదొక్కి అధికారం పోయాక బీసీ నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో గోశిక రవి, పిల్లలమర్రి యాదగిరి,గుర్రం వెంకటేశం,తడక అమర్ పాల్గొన్నారు.