గద్దల ప్రాంగణంలో మొక్కను నాటిన సిద్దబోయిన జగ్గారావు 

నవతెలంగాణ – తాడ్వాయి
మేడారంలో సమ్మక్క- సారలమ్మ వనదేవతల గద్దెల ప్రాంగణంలో ఆదివారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు రామశీత ఫలం మొక్కను నాటారు. ఈ మొక్కను ప్రత్యేకంగా తీసుకొచ్చి నాటినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి అన్నారు. అడవులు ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం కాలుష్యాన్ని నివారించవచ్చని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయి అన్నారు. విద్యార్థులు కూడా విద్యార్థి దశనుండే మొక్కలు నాటడం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ముద్ర కోళ్ల సదానందం, దీప దూప నైవేద్య పూజారి దోబె నాగేశ్వరరావు, ఎండోమెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love