నవతెలంగాణ-హలియా: భారత మాజీ ఉప ప్రధాని,సమతావాది బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి కార్యక్రమాన్ని మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం హాలియాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హాలియా ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎస్ ఐ సతీష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషిచేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. భారత ఉప ప్రధానిగా, రక్షణ మంత్రిగా, రైల్వే మంత్రిగా,కార్మిక, వ్యవసాయ మంత్రిగా దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో సేవలు అందించారని చెప్పారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం అని ఎస్ఐ సతీష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకులు మందా సైదులు రావు గౌతమ్, యడవెల్లి సోమశేఖర్, యడవెల్లి రాంబాబు,హాలియా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ బూడిద విజయ్,ఊరె వెంకటయ్య, నకిరేకంటి సైదులు,కనకరాజు కొండలు, గార్లపాటి చిన్న శేఖర్, గోవర్ధన్, చంద్రయ్య, సింగారం నగేష్,ముజాహార్ తదితరులు పాల్గొన్నారు.