– బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ
నవతెలంగాణ – ఆర్మూర్
వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పేందుకే జై బావు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టామని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ బుధవారం తెలిపారు.. అధిష్టానం నిర్ణయించిన టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా, అదే విధంగా దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ఆప్రజస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని అన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు ఎంత పని చేస్తున్నారు అనేది పరిశీలిస్తున్నారని కావున కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ప్రతిదీ పరిశీలించి అధిష్టానానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది . కాబట్టి ప్రతి ఒక్కరు పని చేయాలని కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మనం చేసిన పనులను ప్రజలకు వివరించడానికి ఉపయోగపడుతుందని, తద్వారా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.