
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యందు శనివారం జై భీమ్, జై బా పు ,జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ లు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలిసికట్టుగా పోరాడుదాం అని అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేపట్టిన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన వీధులలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పండిత్ పవన్, మాజీ కౌన్సిలర్లు కోన పత్రి కవిత కాశిరాం, మేడిదాల సంగీత రవి గౌడ్, ఆకుల రాము, మాజీ సర్పంచ్ మారుతి రెడ్డి, సాయి రెడ్డి, ఎం నారాయణ ,శ్యామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.