Magazines

రూ.19,934 కోట్లతో ఐదు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

23 నిమిషాల క్రితం

projects
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
తమిళనాడులో కామరాజర్‌ పోర్టులో రెండో కంటైనర్‌ టెర్మినల్‌

అసోంలో కొత్త విమానాశ్రయం.. నిర్మాణ పరికరాల తయారీకి రూ.11 వేల కోట్లు

తపాలా సేవల ఆధునీకరణకు మరో రూ.2,632 కోట్లు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక తయారీ, రవాణా రంగాల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమై రూ.19,934 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టలకు ఆమోదం తెలిపింది. ఇందులో నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు రూ.11 వేల కోట్ల పథకంతోపాటు, తమిళనాడులోని కామరాజర్‌ పోర్టులో రెండో కంటైనర్‌ టెర్మినల్‌, అసోంలోని సిల్చార్‌ సమీపంలో కొత్త విమానాశ్రయ నిర్మాణం ఉన్నాయి. అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివ‌ర్గం నిర్ణ‌యాల‌ను వివరాలను వెల్లడించారు.

దేశీయ తయారీకి రూ.11 వేల కోట్లు

నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎనిమిదేండ్ల కాలపరిమితితో రూ.11 వేల కోట్ల పథకాన్ని మంత్రివ‌ర్గం ఆమోదించింది. దిగుమతుల పై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయంగా పరికరాల తయారీని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. టన్నెల్‌ బోరింగ్‌ యంత్రాలు, ఎక్స్‌కవేటర్లు, క్రేన్లు, భారీ ట్రక్కులు, లోడర్లు, డ్రిల్లింగ్‌ యంత్రాలు వంటి పరికరాల తయారీకి ప్రోత్సాహకాలు అందించ నున్నారు.

ఈ పథకం ద్వారా రూ.21 వేల కోట్ల పెట్టు బడులు ఆకర్షించడంతోపాటు, రూ.22,500 కోట్ల మేర దిగుమతులకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎగుమతులు కూడా దాదాపు నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్