Magazines

రామ్‌లీలా మైదాన్‌ ర్యాలీ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

1 గంట క్రితం

Ramlila Maidan rally.. FIR registered
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

​న్యూఢిల్లీ : ఇండియా బ్లాక్‌ నవంబర్‌ 1న రామ్‌లీలా మైదానంలో చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్‌పై మోడీ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. రామ్‌లీలా మైదాన్‌లో ఒక పోలీసు వాహనంపై అభ్యంతరకరమైన వార్తలు రాసిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ న మోదు చేసినట్టు ఒక అధికారి సోమవారం తెలిపారు. ఢిల్లీ ఆస్తుల వికృతీకరణ నిరోధక చట్టంలోని పలు సెక్ష‍న్ల కింద కమలా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైందని అన్నారు. పోలీసు వాహనంపై అభ్యంతరకర రాతలను చూపిస్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు పోలీసులు ఆరోపించారు.

ఢిల్లీ పరిధిలో వర్తించే ఈ చట్టం ప్రకారం.. బహిరంగంగా కనిపించే ఆస్తులపై అనుమతి లేకుండా రాతలు, గుర్తులు వేయడం నేరం. నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా ఏడాది జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్