Magazines

భేష్‌.. మీ కృషి అభినందనీయం

1 గంట క్రితం

Excellent... your efforts are commendable.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

రాష్ట్ర మహిళా కమిషన్‌కు 
జాతీయ మహిళా కమిషన్ ప్రశంసలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

మహిళల హక్కుల పరిరక్షణ, భద్రత, సంక్షేమం, సమానత్వం, సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ తాయి రహత్కర్‌ అభినందించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద న్యూఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కార్యాలయంలో ‌రహత్కర్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు, మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యాచరణ, మహిళల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, కమిషన్ సాధించిన ప్రగతి, వివిధ సామాజిక సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని శారద అందజేశారు. ఆ పుస్తకంలో రాష్ట్ర మహిళా కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, మహిళలకు న్యాయం అందించేందుకు నిర్వహిస్తున్న విచారణలు, బాధిత మహిళలకు అండగా నిలుస్తున్న విధానాలు, మహిళా హక్కులపై అవగాహన కార్యక్రమాలు, వారి భద్రత, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన, గ్రామీణ ప్రాంత మహిళల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ, మహిళలకు కేవలం సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే కాకుండా, వారికి సమాజంలో సముచిత గౌరవం, సమాన అవకాశాలు, భద్రత, న్యాయం, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తెలంగాణలోని ప్రతి మహిళకు న్యాయం అందేలా, మహిళల సమస్యల పరిష్కారానికి కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, పేద, బలహీన వర్గాల మహిళలు, గ్రామీణ మహిళల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ ప్రశంస మహిళా సాధికారత దిశగా మరింత బాధ్యతతో, అంకితభావంతో పనిచేయడానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్