రైతు రుణమాఫీ ఇస్తాం
సమాజ్ వాదీ పార్టీ మ్యానిఫెస్టో : ప్రకటించిన అఖిలేశ్ యాదవ్
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.5 వేల భృతిని ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు లక్నో లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎన్నికల వాగ్దానాలను ప్రకటించారు.రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని గతంలో కొందరు చెప్పారని (బీజేపీ ను ఉద్దేశిస్తూ).. కానీ, అవి రాలేదని ఈ సందర్భంగా అఖిలేశ్ గుర్తుచేశారు. త్వరలో చెడు రోజులు మాత్రం పోతాయని అన్నారు. ప్రతి పట్టభద్రుడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఉద్యోగ ఆధారిత నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల్లో అవకతవకలను సహించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో కులగణన చేపడతామని అన్నారు.
మ్యానిఫెస్టోలో మరికొన్ని..
తక్షణ రైతు రుణమాఫీతో పాటు 23 రకాల పంటలు, పాలకు కనీస మద్దతు ధర
బీపీఎల్‌కు దిగువన ఉన్న ప్రజలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా
వృద్ధ మహిళలు సహా కార్మికులు, కళాకారులకు ఏడాదికి 40వేల పింఛను
సమాజ్‌వాదీ క్యాంటీన్లలో రూ.5కే పేదలు, మహిళలకు భోజనం
12వ తరగతి పాసైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
ప్రతి జిల్లాతోపాటు మహిళలకూ ప్రత్యేక మ్యానిఫెస్టో ప్రకటిస్తామన్నారు.







కామెంట్‌లు (0)