భారత్‌లో పుట్టినా..
బంగ్లాదేశ్‌కు బహిష్కరణ
పేర్ల తొలగింపుతో కుటుంబాలు చిన్నాభిన్నం
భారతీయ మూలాలున్నా.. విదేశీయులంటూ ముద్ర
న్యాయం కోసం కోర్టుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
అమిత్ షా వ్యాఖ్యలతో మరింత పెరిగిన పౌరసత్వ భయాలు
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాలో పేరు తొలగిపోయిందనే కారణంతో ఒక వ్యక్తిని విదేశీయుడిగా ముద్రవేయవచ్చా? పౌరసత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే నిర్బంధించి, దేశం నుంచి బహిష్కరించవచ్చా? మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాల ప్రక్షాళన పేరుతో చేపట్టిన భారీ తొలగింపులు ఇప్పుడు పౌరుల హక్కులకే ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నా యన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
కూరగాయలు కొనడానికి వెళ్లి.. బంగ్లాదేశ్‌లో ప్రత్యక్షం
ముంబయిలో కూరగాయలు కొనడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన 38 ఏండ్ల సహీదా ఫకీర్ తిరిగి తన కుటుంబాన్ని చేరుకోలేక పోయ ింది. జులై 19న సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసులు ఆమెను అదు పులోకి తీసుకుని, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న గుర్తింపు పత్రాలను చూపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. అనంతరం అధి కారులు ఆమెను బంగ్లా దేశ్‌కు తరలించారు. మూడు నెలలకు పైగా గడిచినా భర్త, ఇద్దరు కుమారులకు ఆమె దూరంగానే ఉన్నారు. తన తల్లిదండ్రులు, తాతముత్తాతలు భారతీయులేనని, 1952 నుంచే కు టుంబ సభ్యుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని ఆమె చెప్తున్నారు.
పేరు లేదని బంగ్లాదేశీయుడిగా ముద్ర.. 32 రోజుల నిర్బంధం
ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న నసీరుద్దీన్ షేక్‌తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేదని బంగ్లాదేశీయుడివంటూ ముద్రవేశారని ఆయన ఆరోపిం చారు. కొందరు 32 రోజులపాటు నిర్బంధంలో ఉన్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించిన బాధితులకు విచారణలో జాప్యం మరో సమస్యగా మారింది.
చొరబాటుదారుల ఏరివేతతో ఓట్ల తొలగింపును ముడిపెట్టిన అమిత్ షా
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడాన్ని అక్రమ వలసదారుల ఏరివేతతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ముడిపెట్టారు. ఈనెల 5న హర్యానాలో జరిగిన సభలో చొరబాటుదారులను గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి తొలగించి, ఒక్కొక్కరినీ దేశం నుంచి పంపిస్తామని ప్రకటించారు. కాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ చర్యలపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం విదేశీయుడని నిరూపించే ఆధారం కాదని హక్కుల కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.
13 కోట్ల పేర్ల తొలగింపు.. ముస్లింలే అధికం
ఇలాంటి ఘటనలకు సంబంధించి పది కుటుంబాలను రాయిటర్స్ సంస్థ ఇంటర్వ్యూ చేసింది. వారి బంధువులు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన తర్వాత నిర్బంధం, బహిష్కరణ, విచారణ వంటి చర్యలను ఎదుర్కొన్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సవర ణలో 13 కోట్ల మంది పేర్లు తొలగించగా.. పశ్చిమ బెంగాల్‌లో తొలగించిన 27 లక్షల పేర్లలో 70 శాతం మంది ముస్లింలేనని సబర్ ఇన్‌స్టిట్యూట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర జనాభాలో ముస్లింల వాటా 27 శాతం కావడం గమనార్హం.
పౌరుల హక్కులకే ముప్పు
పౌరసత్వంపై తుది నిర్ణయం తీసుకోకుండానే ఓటు హక్కు కోల్పోయిన వారిని విదేశీయులుగా పరిగణించడం ప్రజాస్వామ్య హక్కులకే విఘాతమని హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు. సరైన గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ తమ భారతీయ మూలాలను నిరూపించు కోవాల్సిన దుస్థితి ముస్లిం కుటుం బాల్లో భయాందోళనలు సృష్టి స్తోంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో పౌరుల హక్కులను బలిపెట్టకుండా, పారదర్శక విచారణకు, న్యాయమైన అప్పీల్ అవకాశాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు.







కామెంట్‌లు (0)