Magazines

ఢిల్లీలో ఆగని అఘాయిత్యాలు

16 నిమిషాల క్రితం

violence
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగికదాడి

ముగ్గురు అరెస్ట్
దేశ రాజధానిలో దారుణాలపై మహిళా సంఘాల ఆగ్రహం


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణాలు అస్సలు ఆగటంలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక సామూహిక అఘాయిత్యాలు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా ఓ యువతిపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు ఆరోపణలు కలకలం రేపాయి. ప్రీత్‌ విహార్‌ ప్రాంతంలోని ఓ కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ అనంతరం 22 ఏండ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

ఏం జరిగింది?

పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు కర్కర్‌డూమాలోని క్రాస్‌ రివర్‌ మాల్‌లో ఉన్న ఓ కేఫ్‌లో పనిచేస్తోంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా అదే కేఫ్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. సోమవారం రాత్రి బాధితురాలితో పాటు మొత్తం ఎనిమిది మంది సహోద్యోగులు ప్రీత్‌ విహార్‌లోని మరో కేఫ్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకుంటూ డ్యాన్స్‌ చేశారు. సాధారణంగా ఆ కేఫ్‌ రాత్రి 11.30 గంటలకు మూసివేస్తారు. అయితే సిబ్బందిలో ఒకరి వద్ద తాళాలు ఉండటంతో, అర్ధరాత్రి తర్వాత మళ్లీ తెరిచి పార్టీ చేసుకున్నారు.


బాధితురాలి వాంగ్మూలం నమోదు

ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట కూడా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఘటన జరిగిన వెంటనే యువతి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేదు. ఓ పురుష స్నేహితుడు, మరో ఇద్దరు మహిళలతో కలిసి వాహనంలో వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం తెల్లవారుజామున 5.45 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయగా.. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్