జయవీరునికి జయ.. జయ నీరాజనాలు

నవతెలంగాణ -పెద్దవూర: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏగ్రామంలో సూచిన మహిళలు, యువత, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి జయవీర్ కు జయ జయ నీరాజనాలు పడుతున్నారు. సోమవారం అనుముల మండలం చింతగుడెం గ్రామంలో ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జయవీర్, మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ కుందూరు జానారెడ్డి కి గ్రామ ప్రజలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. బానాసంచా పేల్చుతూ సంబరాలు జరుపు కున్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love