ప్రాచీన కళలను కాపాడుకోవాలి: జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్

నవతెలంగాణ – ముత్తారం
ప్రాచీన కళలను కాపాడుకోవాలని పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ముత్తారం మండల కేంద్రం లోని గ్రామస్థులు చిరుతల రామాయణం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బుధ వారం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్  చిరుతల రామాయణ సీతారాముల పట్టాభిషేకం పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ.. పూర్వకాలంలో సినిమాలు, టీవీలు లేకముందు గ్రామీణులు అంతా రామాయణం, మహాభారతం నాటకాలు వేసి కళ్లకు కట్టినట్టుగా చూపించేవారని, సినిమాలు, టీవీలు, సెల్‌ఫోన్స్‌ రావడంతో ప్రజలంతా భారతీయ ప్రాచీన కళలను మరిచి పాశ్చాత్య పోకడలతో ముందుకు పోతున్నారన్నారు. మండలంలోని ప్రజలు గ్రామస్థులు అందరూ కలిసి ఈ ప్రాచీన నాగరికతలో భాగంగా రామాయణాన్ని ప్రదిర్శంచడం పట్ల అభినందించారు. కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్  మండల పార్టీ అధ్యక్షుడు  పోతు పెద్ది కిషన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నూనె కుమార్, ఎంపీటీసీ రాగ మల్ల పోచమ్మ మధుకర్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అలూవొజు రవీందర్, ఓడేడు గ్రామ శాఖ అధ్యక్షుడు నరెడ్ల రమేష్, పప్పు చంద్రమౌళి, షేరు స్వామి, ఎర్రవెల్లి పాపారావు కళాకారులు దుబాసి శ్రీనివాస్, మద్దెల దివాకర్ పొన్నం కుమార్ మరియు కళాబృందం పాల్గొన్నారు.
Spread the love