లోక రక్షకుడు ఏసుక్రీస్తు

– వరంగల్ నేత్రాణులు బిషప్ కుడుముల బాల

నవతెలంగాణ – ధర్మసాగర్
లోక రక్షకుడు ఏసుక్రీస్తు అని, మానవుల పాపాల కోసం రక్షణ ప్రసాదించిన ఉత్తన్న క్రీస్తు ప్రభువు ఆశీస్సులు అందరిపై ఉండాలని వరంగల్ మేత్రాణులు కుడుముల బాల అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సిలువ గుట్టపై విచారణ ఫాదర్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ వేడుకలను నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాము ఏవమ్మా పాపల రక్షణార్థము తండ్రి దేవుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి మానవ రూపంలో పంపించారని ఆయన చిందించిన రక్తముతో మానవుడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం నీ చెల్లించి ప్రజలందరిని పరలోక వారసులుగా చేశారన్నారు.ఉత్తన్న క్రీస్తు ప్రభువు దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా ఉత్తన క్రీస్తు ప్రభువు కేకు కట్ చేశారు. అనంతరం విచారణలోని సంఘ పెద్దలు పాటల బృంద సభ్యులు ఆయనను శాలువాలతో పుష్పగుచ్చాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఫాదర్ మాచర్ల నవీన్, ఉపదేశకులు కమలాకర్, సంఘ పెద్దలు మాచర్ల ప్రవీణ్, పళ్ళు మారి చిరంజీవి, కొట్టే శ్రీనివాస్, కొట్టే గణేష్,రాజన్ బాబు, ఏలియా ప్రభుదాస్, విశ్వాసులు సంఘస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love