ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు…

– జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారి/అధికారిణి పి సాహితి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారీగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ కు 10 వ తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (8వ తరగతి పాస్) ఉత్తీర్ణత కలిగి ఉండాలని, అభ్యర్థులు వారి అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఐటిఐ, డిప్లమో, ఎన్ సిసి అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయని, 13 భాషలలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు www.joinindianarmy.nic. ద్వారా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ తదుపరి అభ్యర్థులు జూన్ 2025 మాసంలో సంబంధిత సైట్ నుండి అడ్మిట్ కార్డు పొందవచ్చునని అప్డేట్స్ కొరకు వెబ్సైట్ మరియు అభ్యర్థులు వారి వారి ఈమెయిల్ ఐడి ని పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. మెరిట్ ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుందని, సలహాలు సూచనలకై సికింద్రాబాద్ లోని రిక్రూటింగ్ కార్యాలయం ఫోన్ నెంబరు 040-27740205లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Spread the love