Johnson & Johnson భారతదేశంలో కొత్త ఇంట్రాక్యులర్ లెన్స్ TECNIS PureSeeని విడుదల

స్వచ్ఛమైన రిఫ్రాక్టివ్ డిజైన్‌ను కలిగి ఉన్న, అంతరాయం లేకుండా అధిక-నాణ్యత చూపుని అందించే నెక్స్ట్ జనరేషన్ లెన్స్.

 – ప్రిస్బియోపియా ఉన్న వ్యక్తుల కోసం, కంటి ఆరోగ్య భద్రతలో గ్లోబల్ లీడర్ అయిన Johnson & Johnson*, తన TECNIS PureSee™ స్వచ్ఛమైన రిఫ్రాక్టివ్ ఇంట్రాక్యులర్ లెన్స్ (IOL) ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉందని ప్రకటించింది. TECNIS PureSee™ IOL స్వచ్ఛమైన రిఫ్రాక్టివ్ డిజైన్‌ను కలిగి ఉంది, దీనిని అంతరాయం లేకుండా, అధిక-నాణ్యత తో కలిగిన చూపుని, అధిక అత్యుత్తమ-కేటగిరీ కాంట్రాస్ట్ మరియు తక్కువ కాంతి పనితీరుతో, మోనోఫోకల్ IOLతో పోల్చవచ్చు.1-5

“కటరాక్ట్ సర్జరీ అనేది ప్రతి సంవత్సరం 28 మిలియన్ల ప్రక్రియలతో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అత్యంత సాధారణ సర్జరీ. అయితే కేవలం 10-15% మంది రోగులు మాత్రమే ఆస్టిగ్మాటిజం++ మరియు ప్రిస్బియోపియా** సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన ఆప్టికల్ IOLలను పొందుతున్నారు,” అని Johnson & Johnson MedTech, సర్జికల్ విజన్ ఇండియా & సౌత్ ఏషియా, కంట్రీ మేనేజర్, బుర్జిన్ షహానా అన్నారు, TECNIS PureSee™ IOLని ప్రారంభించడం మాకు గర్వకారణం, ఇది సర్జన్లకు మరియు భారతదేశంలో పెరుగుతున్న రోగులకు IOL స్పష్టమైన చూపు మరియు తగ్గిన దృశ్య లక్షణాలను మిళితం చేసే ప్రీమియం ఆప్షన్ను అందిస్తోంది.”

ఏదైనా IOLను ఎంచుకునేటప్పుడు, సర్జన్లు మరియు రోగులు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, కళ్లద్దాలు లేకుండా అన్ని దూరాలకు స్పష్టమైన దృష్టిని అందించే లెన్స్, గ్లేర్స్ మరియు హాలోస్‌ను తొలగించలేకపోవచ్చు. TECNIS PureSee™ లెన్స్ యొక్క స్వచ్ఛమైన రిఫ్రాక్టివ్ డిజైన్ ఈ సమస్యలను పరిష్కరిస్తుంది మరియు అందువల్ల రోగులు మరియు సర్జన్లు ఇద్దరికీ అన్ని ఫలితాలను మెరుగుపరుస్తుంది.

దాని పూర్తి రిఫ్రాక్టివ్ డిజైన్ తో, TECNIS PureSee™ IOL వక్రీభవన లోపానికి అధిక ప్రయోజనాన్ని అందించడంలో సర్జన్ల సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. TECNIS PureSee™ IOL ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది వీటితో సహా:

  • బాగా దూరం మరియు కొంచెం దగ్గర చూపుతో నిరంతరాయమైన అధిక-నాణ్యత చూపు, అలాగే పెరిగిన చూపు నిరంత్రణ కోసం క్రియాత్మకతో కలిగిన దగ్గర చూపు.
  • ఫ్రీక్వెన్సీ, ఇబ్బందికరమైన మరియు క్లిష్టత స్థాయిలలో మోనోఫోకల్‌తో పోల్చదగిన డిస్ఫోటోప్సియా ప్రొఫైల్, అంటే హాలోస్, గ్లేర్స్ మరియు స్టార్‌బర్స్ట్‌లు వంటి దృశ్య లక్షణాలు తక్కువగా ఉండుట.

2050 నాటికి, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య 2.1 బిలియన్లకు రెండింతలు పెరుగుతుందని అంచనా వేశారు మరియు ఈ వయస్సులో ప్రపంచ పెరుగుదలలో ఆసియా పసిఫిక్ 65% వాటాను కలిగి ఉంటుంది.10 ప్రపంచవ్యాప్తంగా చికిత్స చేయదగిన అంధత్వానికి కంటిశుక్లం ప్రధాన కారణం.11 వైద్య విజ్ఞానం మరియు సాంకేతికత నేడు అభివృద్ధి చెందింది అంటే ఒక అర్హత కలిగిన కంటి శస్త్రవైద్యుడు కంటిశుక్లంను తొలగించి దానిని IOLతో మార్చగలడు మరియు రోగులు సాధారణంగా అదే రోజు మెరుగైన కంటి చూపును పొందుతారు.

Spread the love