మాస్ లైన్ పార్టీలో గుండగాని వెంకన్న చేరిక..

– కొత్తపల్లి శివకుమార్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తూర్పుగూడానికి చెందిన గుండగాని  వెంకన్న సూర్యాపేట మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యాలయం విక్రమ్ భవన్లో పార్టీలో చేరారు.ఆదివారం వీరికి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాస్ లైన్ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామ్రేడ్ వెంకన్న గతంలో చారుమజుందార్ లింపియో పార్టీలో పనిచేసి నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆ పార్టీ విధివిధానాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేవి కావని తెలిసి మాస్ లైన్ పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలను చూసి మార్క్స్ లైన్ పార్టీ విధివిధానాలు వచ్చి నేటి భారతదేశ విప్లవ రాజకీయాలకు మాసులైన్ పార్టీ విధివిధానాలు సిద్ధాంతాలు దిక్సూచి లాంటివని నమ్మి పార్టీలో చేరారు. వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉండి ఏ సమస్య వచ్చినా కాపాడుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్ ,పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న ,పార్టీ డివిజన్ నాయకులు ఎస్కే సయ్యద్ పిడమర్తి లింగన్న పిడిఎస్యు నాయకులు బన్నీ పాల్గొన్నారు.
Spread the love