
గాంధారి మండల అభివృద్ధి కోసమే బీఆర్ ఎస్ పార్టీ నీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ ను కలిసి గాంధారి మండలం లో జరగాల్సిన అభివృద్ధి పనుల కొరకు చర్చించి మాట తీసుకోవడం జరిగిందని, గాంధారి గ్రామంలో సంగం రేవు వంతెన, గాంధారి గ్రామంలో రోడ్డు, డబుల్ బెడ్ రూం ఇల్లు, మొకరం చెరువు సుందరీకరణ గాంధారి యువత కోసం మిని స్టేడియం, వీటన్నిటి పై ఎమ్మెల్యే మధన్ మోహన్ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని, కావున ఈ రోజు ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఇన్ని రోజులు నాకు బి ఆర్ ఎస్ పార్టీ లో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు న ధన్యవాదాలు తెలిపారు. మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ వెంట సుమారు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.