యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ఆదివారం, మాజీ వార్డు సభ్యురాలు సంగి బుజ్జమ్మ మల్లేష్, మాజీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సంగి మల్లేష్ లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మండలం వర్కింగ్ ప్రెసిడెంట్, పిఎసిఎస్ డైరెక్టర్ యేమాల ఏలేందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కళ్లెం విజయ జహంగీర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నసీరుద్దీన్, మండల మహిళా అధ్యక్షురాలు గూడూరు కనకమ్మ, మండల మైనారిటీ అధ్యక్షులు ఎండి యాకూబ్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి జాంగిర్, మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు ఎండి యాకూబ్, గ్రామ మైనార్టీ అధ్యక్షులు ఎండి బురాన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గజం లక్ష్మీ నరసయ్య, చల్లూరి నాగరాజు, ఉస్మాన్, సుంచు వినోద్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.