కాంగ్రెస్ ప్రభుత్వంతో పేద ప్రజలకు న్యాయం

Oplus_131072

నవతెలంగాణ – బొమ్మలరామారం   

6 గ్యారంటీ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని.గురువారం మండలంలోని హాజీపూర్ గ్రామాల్లో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు తాజా మాజీ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కరపత్రాలను పంచుతూ ఇంటింటి ప్రచారం చేశారు.అనంతరం కవిత మాట్లాడుతూ..పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ధరణి, కాళేశ్వరం తో ప్రజల సొమ్మును దోచుకుంటుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ ను ఏమీ చేయలేదని,ఇద్దరు ఒక్కటేనని పేదలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు.లక్ష మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలరాజు, గ్రామ శాఖ తుమ్మల నర్సింహా, చిప్పాల నర్సింహా రెడ్డి ,నర్సింహా రెడ్డి ,పక్కిరు రాంరెడ్డి, బాబు ,అశోక్ ,సుమన్, పరమేష్, రాఘవ రెడ్డి ,కొలిపాక కుమార్,పాముల రాజు ,పరిదా శంకరయ్య, పుర్ర బాలనర్సింహ, పరిదా జంగయ్య, వరిగంటి నర్సింహా, పరిదా మల్లేష్ ,చీర ప్రశాంత్, పరిదా కళ్యాణ్ ,వంశీ,పరమేష్, మధు, విష్షు, పాల్గొన్నారు.
Spread the love