Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అణగారిన వర్గాల ఆశ జ్యోతి పూలే: సర్పంచ్ ఉష

అణగారిన వర్గాల ఆశ జ్యోతి పూలే: సర్పంచ్ ఉష

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
అణగారిన వర్గాల ఆశ జ్యోతి, బహుజన ఉద్యమ పిత, సంఘ సంస్కర్త, విప్లవ జ్యోతి అయిన మహాత్మా జ్యోతిరావ్ పూలే అంటరానితనం నిర్మూలన, విద్య ప్రాముఖ్యత, సామాజిక సమానత్వ సమాజ నిర్మాణం కోసం కలలు గన్న మహా ఋషిగా మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి కొనియాడారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ పాలకవర్గంతో పాటు పంచాయతీ కార్యదర్శి సిబ్బంది ఇతర శాఖల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు గురించి సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్ గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ పంచాయితీ వార్డ్ సభ్యులు అంగన్వాడి టీచర్లు ఐకెపి సిబ్బంది ఆశలు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -