నవతెలంగాణ – ఆర్మూర్
మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 199 జయంతి వేడుకలను పట్టణంలోని లోని జిరాయత్ నగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సంతోషి రాణి ఫూలే చిత్ర పటానికి పూల మాల వేసి సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించడానికి ఫూలే గారు ఎన్నో త్యాగాలు చేశారని, విద్య లేనిదే వివేకం లేదని చాటి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సఫియా బాను, హెబ్సిబా ధొరాతి, సదీయా, అదీబా, రజని, పీఆర్టీయు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మీ నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.